సీతంపేట: జాతీయస్థాయి జావెలిన్ త్రో పోటీలకు ఎంపికైన గిరిజన బాలిక బి.సుశీలను పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ తన కార్యాలయంలో బుధవారం అభినందించారు. సుశీల భామిని ఏకవల్య మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. గత నెల 11న తిరుపతిలో జరిగిన సౌత్‌జోన్ క్రీడా పోటీల్లో జావెలిన్‌త్రోలో ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడల్ సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించింది. త్వరలో జరగనున్న జాతీయస్థా యి పోటీల్లో కూడా ఇదే స్ఫూర్తితో తలపడి ఉత్తమ ప్రతిభ కనబరచాలని, ఉన్నతస్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, గిరిజన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాదేవి, పీఈటీ సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు.
రేగిడి: మండలంలోని సంకిలి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలు ఏపీ చెరకు రైతు సంఘం, సంకిలి సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమి తి ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నదని చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. చక్కె ర కర్మాగారం పరిరక్షణలో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై రైతులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
విజయనగరం క్రైమ్: ఆర్టీసీ డిపోలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ అశోక్, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు డిమాండ్ చేశారు. ఇదే విషయమై వారు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశా రు. యాజమాన్యం నిర్ణయించిన ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎస్.కోట ఆర్టీసీ డిపో పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రతినెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాల ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సూర్యకుమార్, కార్యదర్శి కళారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాసశివరాత్రి పూజలు
విజయనగరం క్రైమ్: స్థానిక శంకర మఠంలో మాసశివరాత్రి పూజలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత గణపతి పూజ అనంతరం పుణ్యాహవచనం, మండపారాధన, మహాన్యాస పారాయణం, మహారుద్ర పారాయణం చేపట్టారు. 11 మంది రుత్వికులతో వేదపఠనం, పారాయణం, రుద్రహోమం చేశారు.


