విజయనగరం:
వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నట్టు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం ప్రదీప్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల తో బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. కొందరు పార్టీని వీడడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ శ్రేణులంతా త్వరలో జరగను న్న స్థానిక సమరానికి సన్నద్ధం కావాలన్నారు. సమాజం అంటే భయం, భక్తి ఉండాలని, అప్పుడే గౌరవం లభిస్తుందని వాఖ్యానించారు. పార్టీకి విధేయులైన కార్యకర్తలు, నాయకులే ప్రధాన బలమన్నారు. ఇకపై వారితోనే పార్టీ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టంచేశారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ జిల్లా స్థాయి సమావేశాలు పూర్తయ్యాయన్నారు. విజయనగరం జిల్లా స్థాయి సమావేశం ఈ నెల 12న ఉదయం 10 గంటలకు పూల్‌బాగ్‌లోని జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, పార్టీలోని రాష్ట్ర కమిటీ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరవుతారని స్పష్టం చేశారు. అలాగే, ఈ నెల 16 నుంచి రోజుకు రెండు నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశాలు అనంతరం మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని పార్టీ సమన్వయకర్తలకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్స య్య, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
16 నుంచి నియోజకవర్గ స్థాయి
సమావేశాలు
పార్టీ శ్రేణులంతా స్థానిక సమరానికి సమాయత్తం కావాలి
శాసనమండలి విపక్షనేత
బొత్స సత్యనారాయణ పిలుపు


