12 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

12 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

ధరల నియంత్రణపై ధర్నా రేపు

కురుపాం: పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌షాపుల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సివిల్‌ సప్లైస్‌ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెయిన్‌రోడ్డులోని ఓ హోటల్‌లో అనధికారికంగా నిల్వ ఉంచిన 8 ఫుల్‌ గ్యాస్‌ సిలిండర్లు, ఓ స్వీట్‌ స్టాల్‌లో 4 గ్యాస్‌ సిలిండర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విజిలెన్స్‌ ఎస్సై రామారావు, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు, కురుపాం సివిల్‌ సప్లైస్‌ డీటీ రమణారావు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ.. హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌ షాపులు, తదితర వాణిజ్య సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లనే వినియోగించాలని సూచించారు. గృహ అవసరాలకు రూపొందించిన సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

పార్వతీపురం రూరల్‌: చుక్కలనంటుతున్న ధరలను నియంత్రించా లని కోరుతూ సెప్టెంబర్‌ 7న స్థానిక కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని ఐద్వా, సీఐటీయూ నా యకులు పిలుపునిచ్చారు. ఈ మేర కు పట్టణంలోని 24, 25 వార్డుల్లో ఐద్వా పట్టణ నాయకురాలు జి.తులసి, సీఐటీయూ నాయకుడు గొర్లి వెంకటరమణ శనివారం ము మ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్లాక్‌ మార్కెట్‌దారులకు, బడా వ్యాపారులకు ప్రభుత్వం దాసోహమైందని.. ధరల కట్టడిలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. పెట్రో ల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌తో పాటు బియ్యం, కందిపప్పు, పంచదార, వంటనూనెల ధరలు యాభై శాతానికి పైగా పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆవేద న వ్యక్తం చేశారు. అమాంతం పెరిగిన ధర ల భారంతో పూట గడవడమే గగనంగా మారిందని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం మొద్దునిద్ర వీడి ధరల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల సరుకులను సబ్సిడీపై పేదలకు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement