ఆండ్ర రిజర్వాయర్‌ భద్రతపై తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఆండ్ర రిజర్వాయర్‌ భద్రతపై తనిఖీ

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

పరిశీలించిన ఐపీఈఓ బృందం

నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీకి నివేదిక అందజేస్తామని వెల్లడి

మెంటాడ: ఆండ్ర జలాశయ డ్యామ్‌ భద్రతా అంశంపై స్వతంత్ర నిపుణుల ప్యానెల్‌ (ఐపీఈఓ) సభ్యులు బుధవారం విస్తృతంగా పరిశీలించారు. తనిఖీల అనంతరం ప్యానెల్‌ చైర్మన్‌, రిటైర్డు చీఫ్‌ ఇంజినీర్‌ పోలేశ్వరరావు, సభ్యులు (రిటైర్డు చీఫ్‌ ఇంజినీర్లు) ఎం.టి.రాజు, చిట్టిబాబులతో కలసి మీడియాతో మాట్లాడారు. ఆండ్ర రిజర్వాయరు భద్రతా పరంగా బాగానే ఉందని, చిన్న చిన్న లోటుపాట్లను సరి చేసుకుంటే సరిపోతుందని వారు స్పష్టం చేశారు. ప్రాజెక్టు వద్ద విద్యుదీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. పరిశీలించిన అన్ని అంశాలను నివేదిక రూపంలో నేషనల్‌ డ్యామ్‌ భద్రతా అథారిటీకి అందజేస్తామని ప్యానెల్‌ సభ్యులు చెప్పారు. విజయనగరం ఇరిగేషన్‌ ఈఈ గోవిందరావు, డీఈ రామునాయుడు, హైడ్రాలజీ డీఈ నర్మదా పట్నాయక్‌, ఏఈ సుధీర్‌, రిజర్వాయరు ఏఈ కృపానంద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement