సాలూరు: గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు చట్ట ప్రకారం విడుదలకు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 1,2 తేదీల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాల్లో భాగంగా సాలూరు, మక్కువ మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వైనాయుడు ,గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకుడు సింహాచలం తదితరులు ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు సునీల్, తవుడు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


