దత్తిరాజేరు: మండలంలోని పెదమనాపురం పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం అర్ధరాత్రి స్కూటీ అదుపు తప్పడంతో మహిళ కింద పడి స్పృహ కోల్పోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అప్రమత్తమై ఆమెను పరిశీలించగా పరిస్థితి విషమించడంతో కానిస్టేబుల్ అప్పన్న ఆ మహిళకు సీపీఆర్ చేసి ప్రాణాపాయం నుంచి కాపాడాడు, వెంటనే అక్కడికి చేరుకున్న 108లో గజపతినగరం సామాజిక ఆస్పత్రికి ఆమెను తరలించారు.మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ అప్పన్నను పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజలు అభినందించారు.
8 మంది జూదరుల అరెస్టు
బాడంగి: మండలంలోని రేజేరు గ్రామ శివారులో జూదం ఆడుతున్న శిబిరంపై పోలీసులు దాడిచేసి 8మందిని పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్సై సూర్యకుమారి మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమాచారం బట్టి తమసిబ్బందితో కలిసి పేకాటశిబిరంపై మంగళవారం సాయంత్రం దాడిచేసి 8 మందిని పట్టుకుని వారినుంచి రూ.13వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిపై కేసునమోదుచేసి పూచీకత్తుపై స్టేషన్‌బెయిల్ మంజూరుచేసినట్లు చెప్పారు. వారినుంచి స్వాఽధీనం చేసుకున్న నగదు, వారిని బొబ్బిలి కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.
ద్విచక్రవాహనం చోరీ
పార్వతీపురం రూరల్: పట్టణంలోని రాయగడ రోడ్డులో నిలిపి ఉంచిన ద్విచక్రవాహనం అపహరణకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద కాలనీ వీధికి చెందిన ఆశపు సతీష్ కుమార్ రాయగడ రోడ్డులో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో తన దుకాణం పక్కన ద్విచక్రవాహనాన్ని నిలిపి ఉంచాడు. అనంతరం స్నేహితుడు పవన్‌న్ స్వరూప్‌తో కలిసి వేరే బైక్‌పై పాత బస్టాండ్ వద్దకు వెళ్లాడు. తిరిగి 6.20 గంటలకు వచ్చేసరికి తాను నిలిపిన చోట వాహనం కనిపించలేదు. రెండు రోజుల పాటు చుట్టుపక్కల పరిసరాల్లో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ను దొంగిలించినట్లు నిర్ధారించుకున్న బాధితుడు మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు టౌన్‌న్ ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు.
40 లీటర్ల సారా పట్టివేత
సీతంపేట: మండలంలోని కుశిమి జంక్షన్ వద్ద 40 లీటర్ల సారాను మంగళవారం పట్టుకున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ బి.వెంకటరాజు తెలిపారు. కుశిమి జంక్షన్ వద్ద గస్తీ నిర్వహించగా ద్విచక్రవాహనంపై అక్రమరవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. సారా విక్రయించిన వారిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా సారా అమ్మకాలు చేసినా, కలిగి ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని స్పష్టం చేశారు.
విత్తన ఉత్పత్తి క్షేత్రం పరిశీలన
సీతానగరం: మండలంలో వరి సాగు చేస్తున్న రైతులు సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేయడం వల్ల రైతాంగానికి బహుళప్రయోజనాలున్నాయని వ్యవసాయశాఖ ఏఓ ఎస్. అవినాష్ అన్నారు. ఈ మేరకు అంటిపేట పంచాయతీ వెంకటాపురం గ్రామంలో మంగళవారం ఆత్మ సౌజన్యంతో సిరి సంచులు విత్తన ఉత్పత్తిలో భాగంగా సిరికి శ్రీనివాసరావు పొలంలో 2 కేజీల ఆర్‌జీఎల్ 7034 రకం విత్తనాలను సాగు చేశారు. ఈ పంటను మండల వ్యవసాయాధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం మొక్కలకు 12 నుంచి 18 పిలకలు ఉన్నాయని, ఈ రకం అగ్గితెగులు, పొడ తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండడంతో పాటు నీటి ప్రవాహాన్ని కూడా తట్టుకునే విధంగా ఉంటుందని తెలిపారు. వరిలో వచ్చే తెగుళ్లనివారణను తట్టుకునే వరివిత్తనాలనే రైతులు ఎంపిక చేసుకోవాలని, విత్తనం తయారీపై వ్యవసాయ సిబ్బంది ఇస్తున్న సూచనలు, సలహాలను ఇనుమడించుకుని రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేయడం వల్ల వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వరివెదలు, నారు వేయడానికి మొక్కవిత్తనం వేయడానికి ప్రత్యేకించి విత్తనాల నిమిత్తం వెతుకులాట చేయాల్సిన అవసరం లేదన్నారు.రైతుల వీలును అనుసరించి వరివిత్తనాలు స్వంతంగా తయారు చేయడంపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు, వీఏఏలు పాల్గొన్నారు.


