సాలూరు: ఓటు హక్కును కాపాడుకునేందుకు గిరిజనులు కోటి కష్టాలు పడుతున్నారు. ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు తమ అర్హతను నిరూపించుకునేందుకు సంబంధిత ధ్రువీ కరణ పత్రాలు సమర్పించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాలూరు మండలంలోని గిరిశిఖర పంచాయతీ కొదమలో 12 గ్రామాలకు సంబంధించి పోలింగ్ బూ త్‌లు 96,97లలో మొత్తం 2,146 మంది ఓటర్ల కు గాను 1,519 మందికి నోటిసులు జారీ అయ్యాయంటే గిరిజన ప్రాంతాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో బూత్ నంబర్ 96లో 1102 ఓట్లకు గాను 1052 మందికి, 97వ బూత్‌లో 1044 మంది ఓటర్లకు గాను 467 మందికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. వారు తమ వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను తీసుకు ని ఈ గిరిశిఖర పంచాయతీకి సంబంధించి కొండ కిందన ఉన్న తుండ సచివాలయానికి కొండలు, కోనలు దాటి చేరుకుంటూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. పోడు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ఈ సమయంలో, చిన్నపిల్లలను ఎత్తుకుని,రాళ్లురప్పలు దాటుకుంటూ సచివాలయానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ గిరిజనుల కష్టానికి ఎవరు కారణమో ఉన్నతాధికారులే ఆలోచించుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు.


