రుణం కావాలా నాయనా..! | - | Sakshi
Sakshi News home page

రుణం కావాలా నాయనా..!

Aug 19 2026 12:36 AM | Updated on Aug 19 2026 12:36 AM

దోపిడీయే దోపిడీ

ప్రభుత్వ బ్యాంకుల మాదిరిగానే పైవేట్‌ బ్యాంకుల్లో రుణాలు పొందాలంటే ఆస్తుల మార్ట్‌గేజ్‌ పత్రాలు ఉండాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు తాము ఉంటున్న ఇల్లు, ఇంటి స్థలాలే ఆస్తులు. వాటినే లక్ష్యంగా చేసుకుని పైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు రుణాలు ఇస్తున్నాయి. ఈ మార్ట్‌గేజ్‌ పత్రాలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి పొందాలి. వాటికోసం ఆయా పైవేట్‌ పైనాన్స్‌ కంపెనీల ఏజెంట్లే కంకణం కట్టుకుంటున్నారు. వారే స్వయంగా తహసీల్దార్‌, వీఆర్‌ఓల అవతారం ఎత్తుతున్నారు. ఫేక్‌ ఽపొజిషన్‌, స్థల హక్కుల పత్రాలు సృష్టిస్తున్నారు. రాజాంతో పాటు ఇతర ప్రాంతాల్లోని సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయాల్లో వాటికి మార్ట్‌గేజ్‌ సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు ఒక్కో ధర కడుతూ చకచకా ధ్రువీకరణ పత్రాలు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తయారైపోతున్నాయి. వాటిని హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో పెట్టి, రుణాలు ఇస్తున్నారు. వాటి కోసం తీసుకున్న రుణంలో కొంత మొత్తాన్ని ఏజెంట్‌కు లబ్ధిదారు అందించాల్సి ఉంది.

రాజాం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో సామాన్యులు, పేద ప్రజలకు ఠంచన్‌గా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేసి ఆర్థికంగా అండగా నిలిచింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు అటకెక్కాయి. సామాన్య, పేద తరగతి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, చిరువ్యాపారులు, కార్మికులకు ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. కార్పొరేషన్‌ రుణాలు, రాయితీ అప్పులు అటకెక్కాయి. ఫలితంగా పేద, మద్య తరగతి కుటుంబాలు అత్యవసర ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక వడ్డీలు ఇస్తామన్నా వడ్డీవ్యాపారులు ముఖం చాటేస్తుండడంతో వారి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుంటున్న హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు పైవేట్‌ రుణాల పేరుతో దోపిడీ ప్రారంభించాయి. ఈ రెండేళ్లలో ఏకంగా 18కిపైగా ప్రైవేట్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు రాజాంలో వెలిశాయి.

బుట్టలో పడుతున్న ప్రజలు

రాజాంలో హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తగ్గట్లు అందులో పనిచేసే చిరుద్యోగుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో కూటమి ఉద్యోగాలు భర్తీచేయకపోవడంతో నిరుద్యోగులు అధికమయ్యారు. చాలా మంది యువకులు ఈ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను పైవేట్‌ బ్యాంకులుగా చెప్పుకుంటూ అందులో చేరుతున్నారు. టార్గెట్‌ రీచ్‌ అయ్యేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వల వేస్తున్నారు. వడ్డీరేట్లు తక్కువని, ఇన్సూరెన్స్‌ ఉంటుందని చెప్పి రుణాలకు సిఫార్సు చేస్తున్నారు. రుణాలు ఇచ్చిన తరువాత తప్పుకుని, ఏజెంట్లతో వడ్డీ వసూళ్లకు ముక్కుపిండుతున్నారు.

సంక్షేమ పథకాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు

తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఫైనాన్స్‌లవైపు చూపు

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు

కోట్లలో లావాదేవీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement