మమ్మల్నే కొనసాగించండి.. | - | Sakshi
Sakshi News home page

మమ్మల్నే కొనసాగించండి..

Aug 19 2026 12:36 AM | Updated on Aug 19 2026 12:36 AM

వచ్చే నెలాఖరు వరకు కాలపరిమితి

ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల కాల పరిమితి వచ్చే నెలాఖరుతో ముగియనుంది. కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది.పాత షాపులను రెన్యువల్‌ చేయవచ్చు లేదంటే కొత్త షాపుల ఏర్పాటుకు దరఖాస్తులైనా కోరవచ్చును.ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.– కె.సహదేవ, జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, పార్వతీపురం మన్యం జిల్లా

వీరఘట్టం: నీరు లేని ఊరుందేమో గాని మద్యం దొరకని ఊరు మాత్రం లేదనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యనిషేధం వైపు అడుగులు వేస్తూ 2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను తగ్గిస్తూ వచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఊరూరా మద్యం షాపులు ఏర్పాటు చేస్తూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడుతోంది. రెండేళ్ల క్రితం అక్టోబర్‌లో కొత్త మద్యం పాలసీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది.ఈ మేరకు ప్రతి షాపునకు రూ.2 లక్షలు ఫీజు నిర్ణయిస్తూ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇలా దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్లు వచ్చి ప్రభుత్వ ఖజానాలో చేరడంతో తర్వాత దరఖాస్తుదారులకు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తూ మద్యం వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా గేట్లు తెరిచింది. ప్రస్తుతం పాత మద్యం దుకాణాల కాలపరిమితి సెప్టెంబర్‌ 30వ తేదీతో ముగియనుంది. దీంతో సిండికేట్లుగా ఏర్పడిన వారందరూ పాత మద్యం పాలసీనే కొనసాగించాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి రాయబారం పంపించినట్లు సమాచారం. ఇందుకు గాను ప్రతి షాపు రెన్యువల్‌ ఫీజు రూ.20 లక్షలు చెల్లించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తులతో రాయబారం చేస్తున్నట్లు అంతా చెప్పుకుంటున్నారు.అయితే చంద్రబాబు ప్రభుత్వం పాత షాపులను రెన్యువల్‌ చేస్తుందా? లేకా కొత్త మద్యం పాలసీని తీసుకువస్తుందా? అనే విషయం మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

పాత షాపులు యథావిధిగా

కొనసాగించాలని..కోరుతున్న

మద్యం దుకాణాల సిండికేట్లు

మద్యం దుకాణాల కాలపరిమితి వచ్చే నెలాఖరుతో సరి

ఇంతవరకు నోటిఫికేషన్‌ ఇవ్వని ప్రభుత్వం

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో 56 మద్యం దుకాణాల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం 2024 అక్టోబర్‌లో చర్యలు చేపట్టింది. వాటిలో గీత కార్మికులకు 4 షాపులు, ఇతరులకు 52 షాపులు కేటాయించారు. ఇందుకు గాను ప్రతి షాపునకు రూ.2 లక్షల ఫీజు నిర్ణయిస్తూ దరఖాస్తులు కోరగా జిల్లా వ్యాప్తంగా ఈ 56 మద్యం షాపుల కోసం 1393 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.27.86 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే పాత షాపులను రెన్యువల్‌ చేయాలంటూ ఇటీవల మద్యం సిండికేట్లు ప్రభుత్వంతో రాయబారాలు చేస్తున్నట్లు సమాచారం.ఇందుకు గాను ప్రతి షాపునకు రూ.20 లక్షలు చొప్పున రూ.11.20 కోట్లు రెన్యువల్‌ ఫీజు చెల్లించేందుకు మంతనాలు చేస్తున్నట్లు సిండికేట్‌ సభ్యులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ.16.66 కోట్లు తక్కువ సొమ్ము ఆదాయం వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వం టేబుల్‌పై ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ మరో వారం రోజుల్లో కొత్త మద్యం పాలసీపై ఏం జరుగుతుందనే విషయం తెలియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement