మెరమెక్‌ జలపాతంలో.. బొబ్బిలి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

మెరమెక్‌ జలపాతంలో.. బొబ్బిలి యువకుడి మృతి

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

మెరమెక్‌ జలపాతంలో.. బొబ్బిలి యువకుడి మృతి ● అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘటన ● పిరిడిలో అలుముకున్న విషాదం

● అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘటన ● పిరిడిలో అలుముకున్న విషాదం

బొబ్బిలి రూరల్‌: మండలంలోని పిరిడి గ్రామాని కి చెందిన సింగిరెడ్డి సా యి శ్రీహరికృష్ణ(26) శనివారం అమెరికాలోని కాలిఫోర్నియాలో మెరమెక్‌ జలపాతంలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నదిలో చిక్కుకుని మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీనివాసరావు, రమాదేవిల ఏకై క కుమారుడైన హరికృష్ణ ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఎంఎస్‌ చేసేందుకు గతేడాది అమెరికా వెళ్లి చదువు పూర్తి చేశాడు. మూడు నెలల క్రితం కాలిఫోర్నియాలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యో గంలో చేరాడు. శనివారం తన పుట్టిన రోజు కావ డంతో స్నేహితులతో కలసి మెరమెక్‌ జలపాతా నికి సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఈతకు స్నేహితులతో దిగాడు. స్నేహితులంతా జలపా తం నుంచి బయటకు రాగా.. ప్రమాదవశాత్తు జలపాతంలో కొట్టుకుపోయాడు. దీంతో అక్కడి పోలీసులు జలపాతంలో గాలింపు చర్యలు చేప ట్టగా కొంత దూరంలో హరికృష్ణ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రు లు, బంధువులు స్వగ్రామంలో కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నవయస్సులోనే అమెరికాలో ఉద్యోగాన్ని సాధించాడని సంబరపడ్డామని, ఇంతలో ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ బోరుమంటున్నారు. ఇటీవల తమకు డబ్బు పంపాడని ఇంతలో అనంత లోకాలకు చేరుకున్నాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకున్న ఒకే ఒక్క కుమారుడిని భగవంతుడు ఇలా తీసుకుపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. హరికృష్ణ తండ్రి శ్రీనివాస్‌ ఆటో నడుపుతుండగా, తల్లి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. ఉన్నంతలో బాగా చదివించామని, ఇంతలోనే విధికి తమ కుమారు డిపై కన్ను కుట్టిందని తల్లిదండ్రులు రోదిస్తున్నా రు. కాగా హరికృష్ణ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చించామని, కేంద్ర ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని జిల్లా మంత్రి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement