పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి
పార్వతీపురం: ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌ఓ కె.హేమలత అధికారుల ను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 33 పరీక్షా కేంద్రాల్లో 5,446 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట పోలీసు బందోబస్తు, వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు అవసరమైన ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలని కోరారు. పరీక్షా కేంద్రాల కు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూ డాలని చెప్పారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంటర్మీ డియట్ పబ్లిక్ పరీక్షలకు అర్హత పరీక్షలు ఉన్నాయ ని,ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పొందడానికి ఈ పరీ క్షలు తప్పనిసరి అన్నారు. జనవరి 21 నుంచి ఈ అర్హత పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


