సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు
విజయనగరం క్రైమ్ : రైల్వే ఫ్లాట్‌ఫాంల పైన, రన్నింగ్ ట్రైన్లలో ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్లను అపహరించే నిందితుడిని విజయనగరం జీఆర్‌పీ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం బొలంగిర్ జిల్లా టిట్లాఘర్‌కు చెందిన పప్పు సేఠ్(26) మొబైల్ ఫోన్లను దొంగతనం చేస్తుండడంతో అదను చూసి మాటు వేసి పట్టుకున్నామని జీఆర్‌పీ ఎస్‌ఐ బాలాజీరావు శుక్రవారం తెలిపారు. గతంలో రైళ్లలో, ఫ్లాట్‌ఫాంలపై ప్రయాణికుల నుంచి పలు ఫోన్లను దొంగతనం చేశాడన్నారు. సేఠ్ నుంచి సుమారు రూ.2లక్షల విలువైన ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రైల్వే కోర్టులో ప్రవేశపెట్టామన్నారు.
అట్రాసిటీ కేసుపై దర్యాప్తు
వంగర: మండలం పరిధిలోని కొప్పర గ్రామానికి చెందిన పీసా తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన అట్రాసిటీ కేసుపై చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు శుక్రవారం దర్యాప్తు చేశారు. అదే గ్రామానికి చెందిన శీలంకి పకీరు నాయుడు కులం పేరుతో దూషించి.. లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనతో రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు, ఎస్సై షేక్ శంకర్ ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో తాపీ మేసీ్త్ర మృతి
బాడంగి: ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం బాడంగి మండల కేంద్రానికి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లాదికి చెందిన గిరడ శ్రీను(50) తాపీ మేసీ్త్రకిగా పని చేస్తుంటాడు. భార్య లక్ష్మి, ఇద్దరు అమ్మాయిలు, సాయికుమార్ అనే మిలటరీ కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం బయటకు వెళ్లిన శ్రీను రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భార్య లక్ష్మి ఫోన్ చేయగా.. బొబ్బిలిలో ఉన్నానని తరువాతి రోజు ఇంటికి వస్తానని చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బాడంగి రైల్వే ఎత్తు ఖానా దిగువున శ్రీను రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి సమీపంలోని సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు హెచ్‌సీ త్రినాధరావు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయాడా, ఎవరైనా కొటిట్ పడేశారాననే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
గుర్ల: మండలంలోని పున్నపురెడ్డి పేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పత్తిగుల్ల లక్ష్మణరావు (37)కు తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు రోజుల పాటు విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పున్నపురెడ్డిపేటకు ద్విచక్ర వాహనంపై లక్ష్మణరావు వెళ్తుండగా అదే గ్రామం శివారులో ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతునికి భార్య పత్తిగుల్ల పుష్ప, ఇద్దరు కుమారులు జశ్వంత్, దయాసాగర్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.
ఆటో ఢీకొని వ్యక్తి మృతి
పీఎం పాలెం: రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరపుకృష్ణాపురం గ్రామానికి చెందిన ముగడ సింహాచలం(65) మధురవాడ ధర్మపురికాలనీలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య అప్పలనారాయణ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లింది. అతడు గురువారం రాత్రి 9 గంటల సమయంలో భోజనం చేయడానికి హోటల్‌కు కాలినడకన బయలుదేరాడు. కారుషెడ్ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొనగా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. మృతుని భార్య అప్పలనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు
సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు
సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు


