పీజీఆర్‌ఎస్‌కు ఎనిమిది వినతులు
సీతంపేట: ఐటీడీఏలో అధికారులు శుక్రవారం నిర్వహించిన (ప్రజాసమస్యల పరిష్కార వేదిక) పీజీఆర్‌ఎస్‌కు ఎనిమిది అర్జీలు వచ్చాయి. పరిపాలనాధికారి సునీల్ వినతులు స్వీకరించారు. హోటల్ నిర్వహించుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని కొండగొర్రె జయచంద్రన్ కోరారు. కురసడుగూడకు చెందిన సవర వెంకటేష్ కొండచీపుర్లు యూనిట్ పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయాలన్నారు. బూర్జగూడ గ్రామానికి సీహెచ్‌డబ్ల్యూఓగా నియమించాలని సవర జ్ఞానేశ్వరి వినతి ఇచ్చారు. పవర్ టిల్లర్ ఇప్పించాలని వంశీ కోరారు. పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


