ఖోఖో పోటీల విజేతలకు అభినందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ పురుషుల ఖోఖో పోటీల్లో ద్వితీయస్థానం దక్కించుకున్న జిల్లా జట్టును జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఈ మేరకు స్థానిక సత్య డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశి భూషణరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సాయిదేవమణిలు క్రీడాకారులను అభినందించారు. గతనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడలో జరిగిన పోటీల్లో జిల్లాక్రీడాకారులు కనబరిచిన ప్రతిభ పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భగవాన్‌దాస్ ట్రస్ట్ కార్యదర్శి ఎ.రంగారావుదొర, చిన్నంనాయుడు, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏఎన్‌ఎం కమలనాభరావు, కె.గోపాల్, కోచింగ్ క్యాంప్ ఇన్‌చార్జి ఎస్‌హెచ్ ప్రసాద్, రామకృష్ణ, ప్రసన్న, వరలక్ష్మి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


