6 నుంచి క్రికెట్ టాలెంట్ హంట్ ఎంపిక పోటీలు
విజయనగరం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా కేంద్రంలోనీ విజ్జి క్రికెట్ మైదానంలో టాలెంట్ హంట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి. సీతారామరాజు శుక్రవారం తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి, టాలెంట్ హంట్ సభ్యుడు ఆర్.విష్ణువర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ నెల 6 నుంచి రెండు రోజులపాటు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అండర్–14 విభాగంలో నిర్వహించే టాలెంట్ హంట్ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు ఒకరోజు ముందుగా తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. పోటీలకు హాజరయ్యే సమయంలో ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. అలాగే సొంత కిట్టు, తెలుపు రంగు దుస్తులు ధరించి రావాలని స్పష్టం చేశారు.
వీడీసీఎ కార్యదర్శి పి. సీతారామరాజు


