అంతర్ వర్సిటీల బ్యాడ్మింటన్ పోటీలకు జీఎంఆర్ విద్యార్
రాజాం సిటీ: ఈ నెల 4 నుంచి 6 వరకు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఇటీవల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జట్టు ఎంపికలో జీఎంఆర్ ఐటీకి చెందిన డి.ప్రవీణ్‌కుమార్, వై.షణ్ముఖ్‌లు ఉన్నారన్నారు. వారు జేఎన్‌టీయూ జీవీ తరఫున ఆడనున్నారని పేర్కొన్నారు. వారి ఎంపికపట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూండెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, అధ్యాపకులు తదితరులు అభినందించారు.
చెస్ టోర్నమెంట్‌లో మాధురి మోక్షితకు
అంతర్జాతీయ రేటింగ్
విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన ఆలిండియా అంతర్జాతీయ ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్‌లో విజయనగరానికి చెందిన నారాయణ స్కూల్ విద్యార్ధిని మాధురి మోక్షిత ప్రతిభ కనపరిచి 1487 అంతర్జాతీయ రేటింగ్ పాయింట్లు సంపాదించింది. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభావతి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 20 రాష్ట్రాలు, ఐదు దేశాల నుంచి మొత్తం 582 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో మాధురి మోక్షిత ఆర్‌వీ 8 రౌండ్లకు గాను నాలుగు రౌండ్లలో విజయం సాధించిందని తెలిపారు. ఈ విజయంలో అంతర్జాతీయ రేటింగ్ 1,487 పాయింట్లు సంపాదించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతను పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.
పోక్సో కేసులో ముద్దాయి 20 ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: జిల్లాలోని బాడంగి పోలీస్‌స్టేషన్‌లో 2024లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి విజయనగరం పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి కె.నాగమణి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం, రాజేరుకు చెందిన బాలిక (14) కనబడడం లేదని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై బాడంగి ఎస్సై జె.తారకేశ్వరరావు డిసెంబర్ 28, 2024న మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో బాడంగి మండలం వాడాడకు చెందిన నిందితుడు వాడాడ వెంకటరమణ (23) ఆ బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కత్తిపూడి తీసకుని వెళ్లాడు. అక్కడ ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో పోక్సో చట్టం కింద బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆపై నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.
రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం
విజయ
నగరం క్రైమ్: విజయనగరం, కోరుకొండ రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది శుక్రవారం గుర్తించారు. సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న ఆ వ్యక్తి మృతదేహం పక్కన వాటర్ బాటిల్ ను పోలీసులు కనుగొన్నారు. మృతుడు 5 అడుగుల పొడవు కలిగి, ఎరుపు రంగు శరీర ఛాయ కలిగి, నీలం రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బ్లాక్ కలర్ జీన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. విజయనగరం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ హెచ్‌సీ పి.రవి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ 9490617089, 9441962879 నంబర్లకు తెలియ జేయాలని ఆయన కోరారు.
అంతర్ వర్సిటీల బ్యాడ్మింటన్ పోటీలకు జీఎంఆర్ విద్యార్
అంతర్ వర్సిటీల బ్యాడ్మింటన్ పోటీలకు జీఎంఆర్ విద్యార్
అంతర్ వర్సిటీల బ్యాడ్మింటన్ పోటీలకు జీఎంఆర్ విద్యార్


