ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
పక్కాగా ‘ముస్తాబు’
పాలకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవర్‌స్వప్నిల్ సూచించారు. పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఏరోబిక్స్ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు రుచికరంగా భోజనం పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులకు అభినందన
సీతంపేట: కొద్దిరోజుల కిందట సీతంపేటలో జరిగిన అన్వేష ఫెస్ట్‌లో అగ్రిటెక్ ప్రాజెక్టు, స్మార్ట్‌ఏటీఎం మోడల్స్‌ను ప్రదర్శించి విజేతగా నిలిచిన సీతంపేట ఏపీఆర్ బాలుర గిరిజన పాఠశాల విద్యార్థులను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇనచార్జి పీఓ పవార్ స్వప్నిల్‌లు శనివారం అభినందించారు. సీనియర్స్‌లో ఎస్.అభినయ, వంశీకృష్ణ, జూనియర్ విభాగంలో లిఖిత్‌కు పార్వతీపురంలో ఓ కార్యక్రమంలో అభినందించినట్టు ప్రిన్సిపాల్ మధు తెలిపారు.
శ్రీనివాసుని కల్యాణానికి తలంబ్రాల సేకరణ
రాజాం సిటీ: వచ్చేఏడాది ఏప్రిల్ నెలలో తిరుపతిలో జరగనున్న శ్రీనివాసుని కల్యాణానికి అవసరమైన తలంబ్రాల కోసం భక్తులు శనివారం ధాన్యంసేకరించారు. అగ్రహారంలో శ్రీనివాసుని రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధాన్యం సేకరణ చేపట్టారు. వీటిని గోటితో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాలుగా శ్రీనివాసునికి సమర్పిస్తామని గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు తెలిపారు.
పార్వతీపురం రూరల్: జిల్లాలోని రైతులకు రబీలోనూ కష్టాలు తప్పేలా లేవు. విత్తనాలు, ఎరువుల కోసం అగచాట్లు పడుతున్నారు. మొన్నటి ఖరీఫ్ సీజన్‌లో బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాలకు పరుగు తీశారు. గంటల తరబడి నిరీక్షించారు. ఆ చేదు జ్ఞాపకాలు చెరిగిపోకముందే ‘రబీ’ సీజన్ ముంచుకొచ్చింది. ఇప్పుడు కూడా ఎరువు కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల మొక్కజొన్న రైతుకు యూరియా అందని పరిస్థితి. జిల్లా వ్యవసాయ శాఖాధికారులు మాత్రం గణాంకాలతో అంతా సిద్ధమని ప్రకటిస్తున్నా.. ఆచరణలో శూన్యంగానే కనిపిస్తోందని రైతులు వాపోతున్నారు.
లెక్కల్లో ఆశాజనకం.. క్షేత్రస్థాయిలో..?
అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం డిసెంబర్ నెలాఖరు నాటికి జిల్లాకు 6,028 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 2,452 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ప్రైవేట్ డీలర్ల వద్ద 591 టన్నులు, సొసైటీల వద్ద 126 టన్నులు, రైతు సేవా కేంద్రాల్లో 731 టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 961 టన్నుల బఫర్ స్టాక్ ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. కాగితాల మీద ఈ లెక్కలు బాగానే కనిపిస్తున్నా.. సమయానికి లారీలు రాక, స్టాక్ పాయింట్ల వద్ద నో–స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ ఇలాగే ‘అంతా ఉంది’ అని చెప్పి, తీరా అవసరమైనప్పుడు చేతులెత్తేశారని చెబుతున్నారు.
ప్రస్తుత రబీ (2025–26) సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఎరువులు, విత్తనాల లభ్యతపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొన్నటి ఖరీఫ్ సీజన్‌లో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, రబీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. జిల్లాలో సాగుకు అవసరమైన అన్ని వనరులను రైతులకు సమకూర్చేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– అన్నపూర్ణ, జిల్లా వ్వవసాయశాఖ అధికారి,
పార్వతీపురం మన్యం
ఎరువులకు కటకట
అరకొర విత్తనాల పంపిణీ
కాగితాలపైనే ఎరువుల నిల్వలు.. క్షేత్రస్థాయిలో అందని పరిస్థితి
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


