ఎస్సీ, ఎస్టీల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి
పార్వతీపురం: ఎస్సీ, ఎస్టీల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి న్యాయం చేయడమే జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జరిగిన కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సివిల్ రైట్స్‌డే కార్యక్రమాలను నిశితంగా పరిశీలించి అవి సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో ప్రశ్నించడానికి కమిటీకి అధికారం ఉందన్నారు. బాధితులు నేరుగా అధికారులకు చెప్పలేని సమస్యలను కమిటీ సభ్యులు గుర్తించి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది తీవ్రమైన నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. పోలీ్‌స్ శాఖ వద్దకు వచ్చిన ప్రతీ కేసును నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, ఏఎస్పీ మనీషారెడ్డి, డీఆర్వో కె.హేమలత, డీపీఓ కొండలరావు, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఎం.శ్యామల, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


