పది యాక్షన్ ప్లాన్ వల్ల రాష్ట్రస్థాయి ఫలితాలు రావు
పదోతరగతి ఉత్తమ ఫలితాల సాధన కోసం రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ రాష్ట్రస్థాయిలో ఒకే విధానంలో ఉండడం వల్ల ఫలితాలు రావు. ఒక్కో జిల్లాలో ఒక్కో స్థాయిలో విద్యార్థుల ప్రిపరేషన్ శైలి ఉంటుంది. ఆయా జిల్లా స్థాయి విద్యార్థుల అవగాహనకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాం. స్టడీ మెటీరియల్ ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన పేపర్‌ను ప్రతిరోజు జిరాక్స్ తీసుకుని రాయడం విద్యార్థికి ఆర్థికంగా భారం. స్లిప్ టెస్ట్ మార్కుల పోస్టింగ్ పనులు ఇవ్వడం వల్ల విద్యార్ధి ప్రిపరేషన్‌పై టీచర్స్ దృష్టిపెట్టలేక పోతున్నారు.
–వై.అప్పారావు,
విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎస్‌టీయూ
●


