బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయం
భోగాపురం: మండలంలోని కవులవావాడ గ్రామానికి చెందిన కొండపు రాంబాబు అనేవ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి 2025 సెప్టెంబర్ 21వ తేదీన రూ.2 లక్షలు మాయమైనట్లు సీఐ కె దుర్గాప్రసాద్ గురువారం తెలిపారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ఆప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ చెప్పారు.
డ్రోన్‌తో గమనించి కేసుల నమోదు
శృంగవరపుకోట: పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఎస్.కోట– శివరామరాజుపేట రోడ్డులో పోలీసులు డ్రోన్‌తో పరిసరాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి 3కేసులు నమోదు చేశారు. మద్యం తాగి బైక్ నడుపు తున్న వ్యక్తిని గుర్తించి డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఇటీవల పోలీసులు డ్రోన్ ఫ్లైతో అనుమానిత ప్రాంతాలను జల్లెడ వేసి శోధిస్తున్నారు
మందుల షాపులో అగ్నిప్రమాదం
కొమరాడ: మండలంలోని విక్రంపురంలో విద్యుత్ షార్కసర్క్యూట్‌తో గురువారం రాత్రి ఓ మెడికల్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..షాపు యాజమాని ఎనిమిది గంటల సమయంలో షాపు కట్టేసి ఇంటికి వెళ్లిన తరువాత విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కావడంతో షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బందికి చుట్టుపక్కల వారు సమాచారం అందించగా తక్షణమే అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు. షాపులో ఉన్న మందులు కాలిపోవడం షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు
మహిళ అదృశ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ గురువారం అదృశ్యమైంది. ఇందుకు సంబంధించి ఎస్సై అశోక్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోనీ వీటీ అగ్రహారం యాత వీధికి చెందిన మహిళ(45)కు పైళ్లె ఒక కూతురు ఉంది. ఇటీవల ఆమె ఓ మహిళ నుంచి ఐదున్నర తులాల బంగారం అవసరాల దృష్ట్యా తీసుకుంది. బంగారం ఇచ్చిన సదరు మహిళ అడుగుతుండగా ఇదిగో అదిగో ఇచ్చేస్తానంటూ వాయిదాలతో తప్పించుకు తిరగసాగింది. ఇటీవలే ఆ బంగారం ఇచ్చిన మహిళ మళ్లీ అడిగింది. ఇక లాభం లేదనుకుని ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అదృశ్యమైన మహిళ కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
కనక మహాలక్ష్మికి కుంభాభిషేకం
విజయనగరం టౌన్: పట్టణంలోని సిటీ బస్టాండ్ వద్దనున్న అభయాంజనేయస్వామి ఆలయంలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారికి పుష్యమాసం గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంభాభిషేకం చేపట్టారు. ప్రధానార్చకుడు వీకే గాయత్రీశర్మ ఆధ్వర్యంలో అర్చకులు భక్తుల గోత్రనామాలతో పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న వారికి అండగా..
పూసపాటిరేగ: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని కొవ్వాడ సర్పంచ్ కోట్ల రఘు అన్నారు. మండలంలోని కొవ్వాడకు చెందిన దేబార్కి రామారావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకన్న రఘు బాధిత కుటుంబానికి రూ. 20 వేల నగదును గురువారం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయం
బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయం
బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయం


