ఏపీఎన్జీఓ ఎన్నికలు ఏకగ్రీవం
పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీఎన్జీఓ) జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా ముగిశాయి. నామినేషన్ల ప్రక్రియలో ప్రతి పదవికి ఒక్కొక్క సెట్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి టి.శ్రీధర్‌బాబు, సహాయ అధికారి ఎ.సురేష్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా జీవీఆర్‌ఎస్ కిషోర్(మెడికల్), అసోసియేట్ అధ్యక్షుడిగా జి.సూర్యనారాయణ (మెడికల్) ఎన్నికయ్యారు. మిగిలిన పదవుల్లో కె.రంగాచారి (కార్యదర్శి), పి.పద్మ (కోశాధికారి), ఎస్.పద్మ (మహిళా ఉపాధ్యక్షురాలు), రేఖా వాణి (మహిళా జాయింట్ సెక్రటరీ)తో పాటు ఉపాధ్యక్షులుగా బి.రామకృష్ణ, టి.వెంకటనాయుడు, ఎస్.భాస్కరరావు, వై.జయప్రకాష్, పి.సురేష్‌కుమార్ ఎన్నికయ్యారు. కె.విజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, వి.శ్రీనివాసరావు, సీహెచ్ శంకరరావు, వి. గణపతిరావు, పి. చంద్రశేఖర్, ఎం.శ్రీధర్ జాయింట్ సెక్రటరీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఎన్నికల ప్రక్రియకు ముందు భారీ ఎత్తున ఉద్యోగులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించా రు. కార్యక్రమానికి పరిశీలకుడిగా ఎ.రంజిత్‌నాయుడు వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లు విద్యాసాగర్, డి.వి.రమణ పిలుపు మేరకు ఉ ద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చే యాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఏపీఎన్జీఓ నేతలు, స్థానిక తాలూకా యూనిట్ ప్రతినిధులు పాల్గొన్నారు.


