క్రాస్ కంట్రీ పరుగు పోటీలో జిల్లాకు పతకాలు
● 24 నుంచి రాంచీలో జరగనున్న జాతీయ పోటీలకు అర్హత
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రాస్ కంట్రీ పరుగు పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో గల ఎంఆర్ కళాశాలలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు క్రీడాకారులు పతకాలు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈ నెల 24 నుంచి రాంచీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో హరీష్ 10 కిలోమీటర్ల పరుగు పోటీలు బంగారు పతకం కై వసం చేసుకోగా... నిరంజన్ 6 కిలోమీటర్ల పరుగులో మరో బంగారు పతకాన్ని చేజిక్కించుకున్నారు. అంతేకాకుండా మహిళల విభాగంలో మహాలక్ష్మి 4 కిలోమీటర్ల విభాగంలో మరో బంగారు పతకంతో నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్‌కిషోర్‌లు అభినందించారు.


