యువకుని అదృశ్యంపై కేసు నమోదు
తెర్లాం: యువకుని అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సాగర్‌బాబు బుధవారం తెలిపారు. మండలంలోని అంట్లవార గ్రామానికి చెందిన ముడిదాన హరి అనే యువకుడు ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతని తండ్రి ముడిదాన పైడితల్లి స్థాని క పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశా డని తెలిపారు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
పోక్సో కేసులో నిందితుడు..
తెర్లాం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన అదృశ్యం కేసుకు సంబంధించి మండలంలోని అంట్లవార గ్రామానికి చెందిన ముడిదాన హరి పోక్సో కేసులో నిందితునిగా ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేయడంతో 2025 ఫిబ్రవరిలో పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది.
పొరపాటున గడ్డి మందు కలిసిన నీళ్లు తాగి రైతు మృతి
పాచిపెంట : పొరపాటున గడ్డి మందు కలిసిన నీళ్లు తాగిన ఓ రైతు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు తెలిపిన వివరాలు.. సాలూరు మండలం కందులపదం గ్రామానికి చెందిన శెట్టి బాబ్జి అనే రైతు పాచిపెంట మండలం గడివలస సమీపంలో 27 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నెల మూడవ తేదీన పొలంలో గడ్డిని చంపడానికి గడ్డి మందు పిచికారి చేసే సమయంలో గడ్డి మందు కలిపిన ప్లాస్టిక్ డబ్బాలో పొరపాటున గడ్డి మందు లేదనుకొని అదే ప్లాస్టిక్ డబ్బాతో పక్కన డ్రమ్ములో ఉన్న నీటిని తీసుకొని సేవించాడు. అలా సేవించిన కొంత సమయానికి వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు సాలూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్య పరీక్షల అనంతరం శరీరంలో పాయిజన్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడి నుంచి విజయనగరం తరువాత విశాఖపట్నం తీసుకువెళ్లి పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చివరకు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య సూర్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకట్ సురేష్ తెలిపారు.


