ఆలయాల్లో హుండీల చోరీని చేధించిన పోలీసులు
● నిందితుడి నుంచి రూ.42,135 స్వాధీనం
● సబ్బవరం స్టేషన్ పరిధిలో మరో చోరీకి పాల్పడిన నిందితుడు
వేపాడ: మండలంలోని బానాది గ్రామంలో ఐదు ఆలయాల్లో జరిగిన చోరీని వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్ నేతృత్వంలో సిబ్బంది హుంఽడీల చోరీని చేధించినట్టు ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక వల్లంపూడి పోలీసుస్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. పోలీసులకు మంగళవారం వచ్చిన సమాచారం మేరకు కె.ఆర్.పేట జంక్షన్‌లో చోరీకి సంబంధించి పెందుర్తి గ్రామానికి చెందిన పెందుర్తి నాగరాజుగా గుర్తించిన పోలీసులు నిందితుని వద్ద రూ.42,135ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 13న బానాదిలో వినాయక ఆలయం, శివాలయం, ఆంజనేయస్వామి, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో తాళాలు పగులకొట్టి హుండీల్లో సోమ్ము చోరీకి గురైన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై ఎస్‌ఐ సుదర్శన్ సిబ్బందితో కలసి నిందితుడు నాగరాజును పట్టుకున్నట్టు చెప్పారు.ఐదు ఆలయాల్లో చోరీకి పాల్పడిన సొమ్ము రూ.42,135లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. సబ్బవరం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ రాత్రి ఓ ఆలయంలో చోరీకి పాల్పడి 10,170 రూపాయలు చోరీ చేసినట్టు నిందితుడు చెప్పినట్టు సీఐ అప్పలనాయుడు తెలిపారు. కార్యక్రమంలో వల్లంపూడి ఎస్‌ఐ ఎస్.సుదర్శన్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


