ఖండాంతరాలు దాటిన అభిమానం
● వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో
ఎమ్మెల్సీ పెనుమత్స
● డల్లాస్‌లో అంబరాన్నంటిన సంబరాలు
నెల్లిమర్ల రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు యూఎస్‌ఏలోని డల్లాస్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స వెంకట సూర్యనారాయణరాజు(సురేష్‌బాబు) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఖండాంతరాలు దాటిన అభిమానం


