సక్రమంగా వైద్యసేవలు అందించాలి
బలిజిపేట: పీహెచ్‌సీలో రోగులకు అన్ని రకాల సేవలు సక్రమంగా అందించాలని హెల్త్ డైరెక్టర్ కె.పద్మావతి సూచించారు. బలిజిపేట పీహెచ్‌సీని ఆమె శనివారం సందర్శించారు. పీహెచ్‌సీ పరంగా ఓపీ సేవలతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన సేవలు సక్రమంగా అందించాలన్నారు. ప్రభుత్వ పరంగా వారికి అందించాల్సిన పథకాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణుల విషయంలో పీహెచ్‌సీలలో ప్రసవాలు జరిగే విధంగా చూడాలన్నారు. చిన్నారులకు క్రమం తప్పకుండా వేక్సినేషన్లు వేయించాలన్నారు. రికార్డులు పరిశీలించారు. పల్స్ పోలియోను శతశాతం విజయవంతం చేయాలన్నారు. షెడ్యూల్ ప్రకారం పోలియో చుక్కలు వేయాలన్నారు. దీనికి సంబంధించి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. డీఎంహెచ్‌వో భాస్కరరావు, రాష్ట్ర లెప్రసీ కన్సల్టెన్సీ సత్యం, బడ్జెట్ రాష్ట్ర ఫైనాన్స్ అధికారి జావీద్, జిల్లా ప్రోగ్రాం అధికారి రఘు, పీహెచ్‌సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి, మాధురి, సిబ్బంది పాల్గొన్నారు.
హెల్త్ డైరెక్టర్ పద్మావతి


