సారా తయారీ కేంద్రాలపై దాడి
పార్వతీపురం రూరల్ : అంత్‌ర్రాష్ట్ర సరిహద్దుల్లో సారా తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళగిరి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డైరెక్టర్ ఆదేశాలతో పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు శనివారం ఒడిశా పోలీసులతో కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించారు. కోరాపుట్ జిల్లాలోని హతిగడ, కర్లీ, హతిగడ కాలనీ గ్రామాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో సుమారు 6,800 లీటర్ల బెల్లపు ఊటతో పాటు 150 లీటర్ల సారాను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో జరిగిన దాడుల్లో పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, సీతానగరం స్టేషన్ల సిబ్బందితో పాటు విజయనగరం ఎన్‌ఫోర్స్‌మెంట్, బృందాలు, సాలూరు బీఎంపీపీ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ఒడిశా ఎకై ్సజ్ అధికారుల సహకారంతో నిర్వహించిన ఈ సోదాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మూడు కేసులు నమోదు చేశారు. సరిహద్దు గ్రామాల్లో అక్రమ మద్యం రవాణా, తయారీపై నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.


