
ఉత్తమ మాస్టార్‌లు
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ నెల 5న నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం బుధవారం వెలువరించింది. అందులో జిల్లాకు చెందిన భౌరోతు
శంకరరావు, ఎర్ర శంకరరావు,
డి.లక్ష్మణరావు ఉన్నారు.
పాలకొండ రూరల్: పాలకొండ ఉన్నత పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న భౌరోతు శంకరరావు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా బహుముఖ ప్రజ్ఞాశీలి. వృత్తితో పాటు పౌరాణిక, రంగస్థల నటుడిగా, సామాజిక కార్యకర్తగా ఈ ప్రాంత ప్రజలకు చిరపరిచితుడు. ఆయన రచనలు సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన తరగతి గదిలో బోధన విలక్షణం. రచనలు, కళలపై విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఆయన రాసిన జిల్లెల ముడమ్మ జీవిత చరిత్ర, శంకర శతకం గుర్తింపును తెచ్చాయి. ఉత్తరాంధ్రాలో రాజకీయ ప్రముఖులకు, విశ్రాంత ఉద్యోగులకు 600లకుపైగా సన్మాన పత్రాలు రాశారు. జిల్లేడు అమ్మ సేవా సంస్థ ఏర్పాటుచేసి పేదలకు, విద్యార్ధులకు తన వంతు సేవలు కొనసాగిస్తున్నారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి అవార్డు వరించింది.
జియ్యమ్మవలస: పెదబుడ్డిడి(బీసీ) ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు ఎర్ర శంకరరావు 2002 డీఎస్సీలో రంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయునిగా ఎంపికై 610 జీవోలో జియ్యమ్మవలస మండలం పరజపాడు గ్రామానికి బదిలీపై వచ్చారు. ఆయన పనిచేసిన పాఠశాలను ఆహ్లదకరంగా తీర్చిదిద్దుతారు. ఉత్తమ బోధనకు అనువుగా మార్చుతారు. వివిధ ఉపాధ్యాయ శిక్షణలు నిర్వహించడంలో ముందుంటారు. ఈయన 1, 2 తరగతుల విద్యార్థుల బోధనకు రూపొందించిన టీఎల్‌ఎంలు ఎన్‌సీఈఆర్టీ, ఎస్‌సీఈఆర్టీ అధికారులను ఆకట్టుకున్నాయి. యూ ట్యూబ్ చానల్ ద్వారా విద్యార్థులకు అవసరమైన పాఠాలను ఈ–కంటెంట్ రూపంలో, నాటికల రూపంలో బోధిస్తున్నారు. ఆయన ఉత్తమ బోధనకు నేడు అవార్డు వరించింది.

ఉత్తమ మాస్టార్‌లు

ఉత్తమ మాస్టార్‌లు