
స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా గోపాల్, విజయలక్ష్మి
విజయనగరం: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులుగా జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు ఎంపికయ్యారు. రెండు రోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన ఇంటర్వ్యూకు ఐదుగురు వ్యాయామ ఉపాధ్యాయులు హాజరుకాగా విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కంటోన్మెంట్ హై స్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె.గోపాల్, విజయనగరం మండలం జొన్నవలస హై స్కూల్లో పని చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయిని ఎస్.విజయలక్ష్మి లను ఎంపిక చేశారు. గతంలో ఒకే స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఉండగా ఈ ఏడాది నుంచి ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున పురుషుల నుంచి ఒకరు, మహిళా విభాగం నుంచి ఒకరిని ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా ఎంపికై న కె.గోపాల్, ఎస్ విజయలక్ష్మిలను జిల్లా విద్యా శాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటనాయుడు, జి.లక్ష్మణరావులు అభినందించారు.

స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా గోపాల్, విజయలక్ష్మి