
పైడితల్లి జాతర మహోత్సవాల ప్రచార రథం ప్రారంభం
విజయనగరం టౌన్:
ిసరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఉత్తరాంధ్ర అంతటా అమ్మవారి పండగను ప్రచారం చేసేందుకు గాను ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అక్టోబరు 6 సోమవారం తొలేళ్ల ఉత్సవం, 7న మంగళవారం సిరిమాను ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నామన్నారు. ఆలయ ఈఓ కె.శిరీష మాట్లాడుతూ అమ్మవారికి నెలరోజుల పాటు నిర్వహించే పండగ కార్యక్రమాల్లో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకోవచ్చన్నారు. అందుకు తగ్గట్టు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వైవి.రమణి, తదితరులు పాల్గొన్నారు.