
సిరివరలో వైద్యసేవలు
సాలూరు రూరల్: మండలంలోని కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి వైద్యసేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అతి కష్టం మీద చేరుకుని అక్కడ వారందరికీ బుధవారం రక్తపరీక్షలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో బాగుజోల నుంచి సిరివర గ్రామానికి రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అయితే రోడ్డు పనులు పూర్తికాక పోవడంతో సిరివర గ్రామానికి రక్తపరీక్షలు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది చలకమెండంగి నుంచి 6 కిలోమీటర్ల దూరం కాలినడకన చేరుకున్నారు. ఎంఎల్‌హెచ్‌పీ అశోక్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది అక్కడ 128 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. వారికి ఏడుగురికి సాధారణ జ్వరాలు ఉన్నట్లు తేలిందని ఎంఎల్‌హెచ్‌పీ అశోక్ తెలిపారు.