
సంయుక్త కలెక్టరుగా యశ్వంత్ కుమార్ రెడ్డి
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా సంయుక్త కలెక్టర్ గా సి.యశ్వంత్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేస్తున్న ఎస్.ఎస్.శోభికకు బదిలీ అయింది. నూతనంగా నియమితులైన 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి.. కొద్దిరోజుల కిందటి వరకు జిల్లాలోనే పాలకొండ సబ్‌కలెక్టర్ గానూ, సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓగా పని చేశారు. కొద్దిరోజుల కిందటే ఆయనకు బదిలీ కాగా.. ప్రస్తుతం జిల్లా లోని సంయుక్త కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కొద్ది రోజుల కిందటి వరకూ ఇక్కడే పని చేసిన అశుతోష్ శ్రీవత్సవ గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా నియమితులయ్యారు.