
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన ఫెన్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు దక్కించుకున్నారు. గత నెల 30,31 తేదీల్లో ప.గో జిల్లా భీమవరంలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారు. అంతర్ జిల్లాల పోటీల్లో కె.హిమశ్రీ, పి.తేజస్విని, టి. యమున సిల్వర్ మెడల్స్ సాధించగా..వి.కేసరి డి.ధరహాసిని, టి.భానుమతి బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను కోచ్ డీవీ చారిప్రసాద్, ఫెన్సింగ్ అసోసియేషన్ సభ్యులు దాలిరాజు, పిల్లా శ్రీనివాస్, వెంకటేష్, సతీష్‌కుమార్‌లు అభినందించారు.