పార్వతీపురం: నూతన ఆవిష్కరణాత్మక ప్రాజెక్టులకు ప్రతిపాదనలను ఈ నెల 5వ తేదీలోగా నీతి అయోగ్‌కు సమర్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారుల తో ఆయన బుధవారం సమీక్షించారు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం(ఏడీపీ), యాస్పిరేషన ల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద నూతన ఆవిష్కరణ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపించాలన్నారు. జిల్లాస్థాయి ప్రతిపాదనల సమన్వయం, పర్యవేక్షణకు నోడల్ అధికారిగా మహేష్ వ్యవహరిస్తారన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జియ్యమ్మవలస(రూరల్): గిరిజన గ్రామాల్లో జ్వరాల ఉద్ధృతి పై ‘మంచం పట్టిన మన్యం’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన వార్తకు వైద్యాధికారులు స్పందించారు. రావాడ రామభద్రపు రం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్ట ర్ సీహెచ్ శంకరరావు సిబ్బందితో కలిసి పిటి మండ గిరిజన గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశా రు. అవసరమైన వారికి మందులు అందజేశా రు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత గిరిజనులకు అవగాహన కల్పించారు. కాచిచల్లార్చిన నీటిని తాగాలని సూచించారు.
వీరఘట్టం: మండలంలోని పెద్ద గదబవలస పంచాయతీ పరిధిలో గదబవలస కాలనీకి కొద్ది దూరంలో గిరిజనులు వేసుకున్న ఐదు పూరిళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం నిప్పుపెట్టారు. పూరిళ్లన్నీ కాలిబూడిదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జి.కళాధర్ తెలిపారు. గదబవలస కాలనీకి సందిమానుగూడకు మధ్యలోని ప్రభుత్వ స్థలాన్ని సందిమానుగూడకు చెందిన గిరిజనులకు ఐటీడీఏ గతంలో డీ పట్టాలు ఇచ్చింది. అదే స్థలంలో గదబవలస కాలనీకి చెందిన కొంత మంది అక్రమంగా గుడెసెలు వేశారు. దీనిపై పట్టాదారులు ఫిర్యాదు చేయడంతో ఈ ఏడాది జనవరిలో తొలగించారు. మళ్లీ గదబవలస కాలనీ కి చెందిన కొంత మంది ఈ ఏడాది మార్చి నెలలో ఇక్కడ మరలా గుడెసెలు వేశారు. ప్రస్తుతం వాటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్టు ఎస్‌ఐ తెలిపారు.
పార్వతీపురం రూరల్: బడిదేవరకొండ గ్రానైట్ లైసెన్స్‌ను రద్దుచేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వెలగవలస చెరువును గ్రానైట్ బూడిదతో నింపేసి చేపల వేటకు వెళ్లిన మత్స్యాకారుడు పాడి బంగారిదొర మృతికి గ్రానైట్ కంపెనీయే కారణమని ఆరోపించా రు. బంగారిదొర కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇప్పించేందుకు అధికారులు చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేసి యజమానిని అరెస్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైందని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. దరఖాస్తులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్‌సైట్ ‘బీఎస్‌ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’లో అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆవిష్కరణాత్మక ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపాలి
ఆవిష్కరణాత్మక ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపాలి