
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ141 శ్రీ252 శ్రీ262
చికెన్
● జిల్లా న్యాయసేవా అధికార సంస్థ
కార్యదర్శి కృష్ణప్రసాద్
డెంకాడ: బాల్య వివాహాలు చేయడం నేరమని, చేసిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తారని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు డెంకాడ మండలంలోని పెదతాడివాడ గ్రామంలో యూత్‌క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సమాజం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా బాల్య వివాహాల కేసులు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు చేసిన వారికి, చేయించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. న్యాయ సహాయం కోసం పేదలు జిల్లా న్యాయ న్యాయసేవా అధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. బాలలు పాఠశాలలో ఉండాలని, వారిని పనిలో ఉంచితే బాలకార్మిక చట్టాల ప్రకారం నేరమన్నారు. వీటిపై కూడా కేసులు నమోదు చేస్తారని చెప్పారు. పెదతాడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై బాలికలకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమాల్లో బెజ్జిపురం యూత్‌క్లబ్ కోఆర్డినేటర్ ఝాన్సీ, సచివాలయ కార్యదర్శి అప్పలనాయుడు, వివిధ విభాగాల అధికారులు, గ్రామపెద్దలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.