
శాంతిభద్రతల పరిరక్షణలో సేవలు శ్లాఘనీయం
విజయనగరం క్రైమ్:
జిల్లా పోలీసు శాఖలో హోంగార్డులుగా సుదీర్ఘ కాలం సేవలందించి, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం ’ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ హోంగార్డుల సేవలను కొనియాడి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులు కె.సూర్యనారాయణ, ఎం.వెంకట రామకృష్ణారావులను పోలీసుశాఖ తరఫున ఎస్పీ వకుల్ జిందల్ మనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఉద్యోగ విరమణ తరువాత ఇకపై ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులకు ఎస్పీ సూచించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన గార్డుల దంపతులను జిల్లా పోలీసుశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందించి, శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఆర్.రమేష్ కుమార్, ఇనార్జ్ హెచ్సీ రాజు, హోంగార్డ్స్, వారి కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.