
ఇంటిల్లిపాదినీ పట్టిపీడిస్తున్న మలేరియా
ఈ చిత్రంలో ఒకే మంచంపై వైద్యసేవలు పొందుతున్న ముగ్గురు చిన్నారులదీ ఒకే కుటుంబం. వారికి సపర్యలు చేస్తున్న మహిళ పిల్లలే వీరంతా. ఆమె పేరు మండంగి నిరోష. గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి పంచాయతీ పరిధిలోని మొరమగూడ గ్రామం. తొలుత ఆమెకు మలేరియా పాజిటివ్ వచ్చింది. భద్రగిరి సీహెచ్‌సీలో వైద్యసేవలు పొందుతోంది. ఇంతలోనే ఆమె కుమారుడు వినయ్‌కు మూడురోజుల కిందట, కుమార్తెలు ప్రియాంక, కల్పన రెండు రోజుల కిందట జ్వరం బారిన పడ్డారు. వైద్యపరీక్షలు చేస్తే మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందరూ ఒకే ఆస్పత్రిలో, ఒకే మంచంపై వైద్యసేవలు పొందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందని, స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదని, దోమ తెరలు ఇచ్చేవారే లేరంటూ నిరోష వాపోయింది.