
వచ్చారు..
●రోడ్డు వేయాలని ఐదుసార్లు
వీరు గుమ్మలక్ష్మీపురం మండలం వల్లాడ, బయ్యాడ గ్రామస్తులు. గొరడ ఆర్‌అండ్‌బీ రహదా రి నుంచి తమ ప్రాంతానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పటికి ఐదు దఫాలుగా పీజీఆర్‌ఎస్‌కు వచ్చి వినతిపత్రం అందజేశారు. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల అత్యవసర సమయంలో గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తరలించేందుకు చాలా ప్రయాసలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతున్నాయని వాపోతున్నారు. సరకులు తీసుకుని వెళ్దామన్నా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. మరోసారి అధికారులను కలిసి తమ సమస్య చెప్పుకొన్నారు. రావడమే మిగులుతుంది గానీ.. సమస్య పరిష్కారం కావడం లేదని వారు వాపోయారు.