
● ఉచిత విద్యుత్‌తో సాగు భరోసా..
సంవత్సరాలు గడుస్తున్నా వైఎస్సార్ చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరి మదిలో నిలిచే ఉన్నాయి. రైతుల రుణాల మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాల కల్పనతో రైతన్నల గుండెల్లో గుడికట్టుకున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువుకు ఊతమిచ్చి విద్యార్థుల మనసుగెలుచుకున్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలతో ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించి ఆరోగ్యప్రదాతగా పేరుగాంచారు. మంగళవారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు పల్లె, పట్టణ ప్రజలు సిద్ధమవుతున్నారు.
విజయనగరం ఫోర్ట్/కొమరాడ:
తీవ్ర కరువు పరిస్థితులు.. ఎటుచూసినా దుర్భిక్షమే.. తినడానికి తిండలేక రైతులు వలస పట్టే రోజులు.. వరుస కరువులతో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయిన వైనం.. చాలా మంది రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి.. ఇటువంటి పరిస్థితులను చూసిన చలించిన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేసి రైతుబాంధవుడిగా పేరుకెక్కారు. రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకం అందించారు. అందుకే వైఎస్సార్ పాలన తమకు స్వర్ణయుగం వంటిదన్నది రైతుల మాట.
వరుస కరువుల వల్ల 2004కు ముందు రైతులు కష్టాలతో కొట్టుమిట్టాడే రోజులు అవి. భూములు సాగుకు నోచుకోక పోవడంతో బీడు భూములుగా మారాయి. మరోవైపు విద్యుత్ చార్జీల భారం. రైతులు వ్యవసాయం చేయడానికి వెనుకాడే పరిస్థితి. ఆ సమయంలో అధికారం చేపట్టిన వైఎస్సార్ రైతుల రుణాలుమాఫీ చేయడంతో పాటు బోర్లు ద్వారా పంటలను సాగు చేసుకోవడం కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. అప్పటి ప్రతిప్రక్ష తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే హేళన చేశారు. కాని రైతు సంక్షేమం కోసం తాను ఎంత ఖర్చు అయినా చేస్తానని ఐదేళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాట ఆడలేని పరిస్థితిని కల్పించారు. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతుండడం ఆయన చలువే అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు.
రైతు బాంధవుడు వైఎస్సార్
రుణమాఫీ చేసి రైతుల ఊపిరి నిలిపిన మహనీయుడు
ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలతో వైద్య భరోసా కల్పించిన ఆరోగ్యప్రదాత
ఉచిత విద్యుత్‌తో రైతన్నకు సాగు అండ
నేడు వైఎస్సార్ వర్ధంతి

● ఉచిత విద్యుత్‌తో సాగు భరోసా..