
● ఆదుకున్న అత్యవసర సేవలు..
108 వాహన సేవలు రాక ముందు ఆపద సమయాన సకాలంలో ఆస్పత్రికి వెళ్లలేక ఎంతో మంది మృత్యువాత పడేవారు. 108 వచ్చిన తర్వాత ఫోన్ చేసిన 15 నిముషాల్లో కుయ్‌కుయ్‌మంటూ క్షణాల్లో సంఘటనా స్థలానికి వాహనం చేరుకుని ఆస్పత్రికి చేర్చడం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. 104 సేవలతో పల్లె చెంతకే వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్సార్‌దే. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎలాంటి వ్యయప్రయాసలకు గురికాకుండా నెలనెలా వైద్యపరీక్షలతో పాటు అవసరమైన మందులు అందజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినది ఆయనే.
● కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద 1976లో చేపట్టిన జంఝావతి రిజర్వాయర్ నిర్మాణం ఒడిశా వివాదంతో నిలిచిపోయింది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఆస్ట్రియా దేశ టెక్నాలజీతో రూ.6కోట్లు ఖర్చుచేసి రబ్బర్‌డ్యాం నిర్మించి 12 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ఆ ప్రాంత రైతుల గుండెల్లో గుడికట్టుకున్నారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు పూర్తిచేయడంలోనూ ఆయన కృషి ఎనలేనిదని ఇప్పటికీ ఈ ప్రాంతరైతులు చెబుతారు.
● విజయనగరం విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందించాలనే ఉద్దేశంతో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్సార్‌దే. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకువేసి కళాశాలను యూనివర్సిటీగా స్థాయి పెంచారు. విద్యార్థుల ఇంజినీరింగ్ కలను నెరవేర్చే విద్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు.

● ఆదుకున్న అత్యవసర సేవలు..

● ఆదుకున్న అత్యవసర సేవలు..