
కనికరించండి సారూ..
సాక్షి, పార్వతీపురం మన్యం: ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. అన్యోన్యంగా ఉన్న బాంధవ్యాల ను చిన్నాభిన్నం చేసింది. వృద్ధాప్యంలో తనకు తోడు ఉంటారనుకున్న కుమారుడు, కోడలు.. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. ముక్కుపచ్చలా రని చిన్నారులకు ఇప్పుడు తానే అంతా! ఏ ఆధా రమూ లేని తనకు.. మరో ఇద్దరి బిడ్డల భారం! అధికారుల సాయం కోసం తిరుగుతోంది. మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయతీ కోదు పెద్దవలస గ్రామానికి చెందిన మండంగి లచ్చమమ్మ కుమారుడు శంబర పీహెచ్‌సీలో పని చేసేవాడు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం మరణించాడు. ఆయనకు ఉద్యోగం ఉండటం వల్ల ఆ కుటుంబానికి రేషన్ కార్డు, వారి ఇద్దరి పిల్లలకు తల్లికి వందనం రాలేదు. తమ దీనస్థితిని వివరిస్తూ.. న్యాయం చేయాలని పిల్లల తల్లి అధికారుల చుట్టూ తిరిగింది. చివరికి ఆమె కూడా అనారోగ్యంతో ఇటీవలే మరణించింది. తల్లిదండ్రులు ఇద్దరూ కొద్ది రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో ఆ పిల్లలు దిక్కు లేనివారయ్యారు. కూలి పనులు చేసుకుని బతికే నాయనమ్మే అన్నీ అయ్యింది. తండ్రి రేషన్ కార్డులో వీరి పేర్లు ఉండిపోవడంతో ఏ ప్రభుత్వ పథకానికీ నోచుకోవ డం లేదు. కనీసం బిడ్డల చదువుకు ఉపయోగపడే లా తల్లికి వందనం పథకం అయినా ఇవ్వాలని.. తనకు ఆధారం చూపాలని నాయనమ్మ లచ్చమ మ్మ కోరుతోంది. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు వచ్చి, అధికారులకు తన దీన స్థితిని వివ రించింది. కష్టమైనా వారి పరిస్థితి చూసి కొంత కనికరం చూపుతుందేమో.. మరి మన అధికారు లు ఏం చేస్తారో చూడాలి.