
కూటమి తీరుపై నిరసన హోరు
కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ వర్గాల ప్రజలు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళనలు చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు. పీజీఆర్‌ఎస్‌లో వినతులు అందజేశారు. రైతుసేవా కేంద్రానికి వచ్చిన 120 బస్తాల యూరియాలో ఒక్క బస్తాకూడా రైతులకు పంపిణీ చేయలేదంటూ కొమరాడ మండలం పూడేసు రైతులు ఆందోళన చేయగా, ఇంటి బిల్లులు చెల్లించాలంటూ సీతంపేట మండలం మర్రిపాడు గ్రామస్తులు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ అరకు సభలో ఏజెన్సీ ప్రాంతాల్లో వందకు వందశాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇస్తామని హామీ ఇచ్చి మెగా డీఎస్సీతో అన్యాయం చేశారంటూ ఆదివాసీ గిరిజన, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఏజన్సీలో వందశాతం ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలని, జీఓ నంబర్ 3ను
పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. – పార్వతీపురం రూరల్

కూటమి తీరుపై నిరసన హోరు