
ఉత్తమ పౌరసమాజనిర్మాణమే లక్ష్యం కావాలి
పార్వతీపురం: ఉత్తమ పౌర సమాజ నిర్మాణమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం కావాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలో జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గిరిజన గ్రామాల్లో పాఠశాలలు, వసతిగృహాలు, కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి విద్యార్థులను చైతన్య పరచాలని సూచించారు. కొన్ని గ్రామాలను దత్తతను తీసుకుని అన్ని విషయాల్లో..అన్ని రంగాల్లో శత శాతం లక్ష్యం సాధించేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు పాలక రంజిత్‌కుమార్, వంగల దాలినాయుడు, డి.చంద్రమౌళి, ఎం.వెంకటరమణ, కె.చిన్నారావు, యు.నాగార్జున, పి.సురేష్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.