
ఉద్యోగులకు ఉత్తమ సేవలతో గుర్తింపు
విజయనగరం: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించడం ద్వారా ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రజలకు మంచి సేవలందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. మెంటాడ మండల ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన బీఎస్‌కేఎన్ పట్నాయక్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొదిన పట్నాయక్ దంపతులను దుశ్శాఽలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించడం తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల పరిషత్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు