
పీడీలు లేరు..భోజనానికి బిల్లులులేవు
జిల్లాలో గల ప్రభుత్వ 14 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పీడీలు లేకపోవడం దారుణం. విద్యార్థులు కోల్పోతున్న క్రీడాజీవితం పాపం ప్రభుత్వానిదే. అలాగే విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనాల బిల్లులను ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. భోజనానికి బిల్లులు సమయానికి చెల్లించకపోవడానికి ప్రధాన కారణం జిల్లా విద్యాశాఖాధికారి నిర్లక్ష్యమే. నెలల తరబడి బిల్లుల బకాయిలు చెల్లింపులు జరగకపోతే నిర్వహణ ఎలా జరుగుతుంది? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీల(వ్యాయామ అధ్యాపకులు)ను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకు ఈ దశలో వ్యాయామం, క్రీడలు చాలా అవసరం.
– పాలక రంజిత్ కుమార్, గిరిజన
సంక్షేమసంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి