
● కూలుతున్న కల్వర్టులు..
సంతకవిటి మండలంలో మూడు కల్వర్టులు, మాధవరాయపురం వద్ద సాయన్నగెడ్డపై వంతెన ఇటీవల శిథిలమై కూలిపోయాయి. సాయన్నగెడ్డపై వంతెన కూలడంతో రేగిడి మండలం ఖండ్యాం నుంచి సంతకవిటి మండలం కేఆర్ పురం, రంగారాయపురం, జావాం, శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం ప్రజలు పాలకొండ, రేగిడి, వంగర, మడ్డువలస తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణం భారంగా మారింది. సంతకవిటి, చిత్తారపురం ప్రధాన రహదారిలో పోతులజగ్గుపేట మూడు రోడ్ల కూడలి వద్ద కల్వర్టు సగం కూలడంతో ఈ మార్గంలో బస్సు ప్రయాణాన్ని కుదించారు. ఇదే మార్గంలో వినాయక రైస్‌మిల్లు సమీపంలో కల్వర్టు కూలడంతో దానిపై మట్టి పోశారు. రాజాం – సంతకవిటి ప్రధాన రహదారిలో గరికిపాడు వద్ద కల్వర్టు సగం కూలడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.
– సంతకవిటి

● కూలుతున్న కల్వర్టులు..

● కూలుతున్న కల్వర్టులు..