
పిడుగు పాటుకు మహిళా రైతు మృతి
లక్కవరపుకోట : మండలంలోని గేదులవానిపాలెం పంచాయతీ శివారు వేచలపువానిపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు నెక్కల ఈశ్వరమ్మ(36) పిడుగు పాటుకు గురై శనివారం మృతి చెందింది. దీనికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మృతురాలు ఈశ్వరమ్మ గ్రామానికి సమీపంలో గల పంట పొలంలో వరి గాబు తీత పనులో ఉండగా మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో పడిన పిడుగుకు ఈశ్వరమ్మ పొలంలోనే పడిపోవడంతో సమీపంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న రైతులు గుర్తించి వెంటనే ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా మృతురాలికి భర్త, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈశ్వరమ్మ మృతితో కుటుండ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.