
మొబైల్ రికవరీ మేళాలో 206 సెల్‌ఫోన్ల అప్పగింత
● సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే తక్షణమే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి
● ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి
పార్వతీపురం రూరల్: పోగొట్టుకున్న, దొంగలించబడిన దాదాపు రూ.42లక్షల విలువైన 206 సెల్‌ఫోన్లను బాధితులకు అందజేశామని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన తక్షణమే వారు సంబంధిత పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. అలా అయితే సీఈఐఆర్ అనే పబ్లిక్ వెబ్‌సైట్‌లో ఆలస్యం లేకుండా లాకింగ్ అభ్యర్థన ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్నట్‌లైతే ఆ ఫిర్యాదు ఆధారంగా ఫోను ఐఎంఈఐ నంబరుతో బ్లాక్ చేసిన తరువాత ఆ రిక్వెస్ట్ ద్వారా మొబైల్‌ను ట్రాక్ చేసి సెల్‌ఫోన్ రికవరీ అయిన తరువాత అన్‌లాక్ చేసి పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఈ ఏడాదిలో గత 8 నెలల వ్యవధిలో పోగొట్టుకున్న 206 సెల్‌ఫోన్లను రికవరి చేశామన్నారు. ఇప్పటికే వచ్చిన 1200 ఫిర్యాదులలో గతంలో 500 సెల్‌ఫోన్లు బాధితులకు అప్పగించగా మరో 206 సెల్‌ఫోన్లను పోగొట్టుకున్న వారికి ఇప్పుడు అప్పగించామన్నారు. మేళాలో పార్వతీపురం సబ్ డివిజన్ ఏఎస్పీ అంకితా సురానా, పాలకొండ సబ్ డివిజన్ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సోషల్ మీడియా, సైబర్ సెల్‌సీఐ శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ రంగనాధం, సీసీ ఎస్ సీఐ అప్పారావు, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఏఆర్ ఆర్‌ఐ నాయుడు, సోషల్ మీడియా సెల్ ఎస్‌ఐ రవీంద్రరాజు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మొబైల్ రికవరీ మేళాలో 206 సెల్‌ఫోన్ల అప్పగింత