
గల్లంతైన గిరిజన మత్స్యకారుడి మృతదేహం లభ్యం
పాచిపెంట : మండలంలోని కోడికాళ్ళవలస గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారుడు జన్ని బాలరాజు(37) చేపల వేటకు వెళ్లి ఈ నెల 27వ తేదీన గల్లంతైన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే స్థానిక ఎస్‌ఐ వెంకట్ సురేష్ నేతత్వంలో నాలుగు రోజులుగా గజ ఈతగాళ్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా, శనివారం ఉదయం 8 గంటల సమయంలో బాలరాజు మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
క్షేమంగా ఉండి ఉంటాడని ఆశ పడ్డాను..
గల్లంతై మూడు రోజులుగా భర్త ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఎక్కడో ఒకచోట తన భర్త క్షేమంగా ఉండి ఉంటాడనే చిన్న ఆశతో ఉండే భార్య బుజ్జి భర్త మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ సంఘటన స్థానికంగా కలచివేసింది.

గల్లంతైన గిరిజన మత్స్యకారుడి మృతదేహం లభ్యం