
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
పార్వతీపురం టౌన్:
పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద గల ఈవీఎం గోదామును కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన గోదాములను సందర్శించి అక్కడ పరిస్థితిని గమనించారు. గోదాములకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లును పరిశీలించారు. ఈ మేరకు పర్యవేక్షణ రిజిస్టర్‌లో ఆయన సంతకం చేసి గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా రు. ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, స్థానిక తహసీల్దార్ సురేష్ తదితరులున్నారు.